Japan Movie X Review: జపాన్ మూవీ రిజల్ట్ ఏంటి? ఆడియన్స్ ఏమంటున్నారు?

Japan Movie X Review: జపాన్ మూవీ రిజల్ట్ ఏంటి? ఆడియన్స్ ఏమంటున్నారు?

విభిన్నమైన సినిమాలు, పాత్రలు చేస్తూ  సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ(Karthi). రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటాడు ఈ హీరో. అందుకే కార్తీ నుండి ఒక సినిమా వస్తుంది అంటే చాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మన ఆడియన్స్. నటుడిగా తన 20 ఏళ్ల ఏళ్ళ కెరీర్ లో 24 చిత్రాలు చేసిన కార్తీ.. తన 25వ చిత్రం జపాన్‌(Japan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించారు. టీజర్‌, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను..జోకర్ ఫేమ్ రాజు మురుగన్ తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవల్లో వచ్చిన హీస్ట్ థ్రిల్లర్ నేడు(నవంబర్ 10) థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల షోస్ పడిపోవడంతో.. సినిమా చూసిన ఆడియాన్స్ సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి కార్తీ జపాన్‌ మూవీ ఎలా ఉంది? ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఈ రివ్యూలో  చూద్దాం.

Also read :- 5ఏళ్ల తర్వాత.. బాయ్‌ఫ్రెండ్‌ను చూసిన ఆనందంలో.. ఎయిర్‌పోర్ట్‌లో డ్యాన్స్

జపాన్ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. సినిమా చాలా బాగున్నా.. కథనం అంత ఆసక్తికరంగా లేదని కొంతమంది అంటున్నారు. మరి కొందరైతే.. జపాన్ ఫస్టాఫ్ యావరేజ్‌గా, సెకండాఫ్ టాప్ ఉంది. జపాన్ లో పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ సంగీతం అద్భుతంగా ఉంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తంగా కార్తీ జపాన్ మూవీ యావరేజ్ గా ఉందని, వన్ టైం వాచబుల్ అనే కామెంట్స్ వస్తున్నాయి.