
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ విభిన్న కతనాలు ఎంచుకుంటూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. అయితే ఇటీవలే సత్యం సుందరం సినిమాతో కూల్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు సర్దార్ 2 సినిమాతో యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. 2022లో వచ్చిన సర్దార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ని దర్శకుడు పిఎస్ మిత్రన్ ఈసారి డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు.
అయితే ఉగాది రోజున ఈ సినిమా అనౌన్స్ మెంట్ ని ప్రకటించిన మేకర్స్ సోమవారం "సర్దార్ 2 - నాంది" వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవర్ఫుల్ ఫైట్ యాక్షన్స్ సీక్వెన్స్ ని చూపించారు. అలాగే విలన్ ఎస్ జే సూర్య పాత్రని కూడా రివీల్ చేశారు. ఇక సర్దార్ సినిమాలో నీటి ప్రళయం గురించి చూపిస్తూ అక్కడి నుంచే స్టోరీ మళ్ళీ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ లో జైలు నుంచి రిలీజ్ అయిన సర్ధార్ చైనీయుల వాటర్ స్కామ్ ని ఎలా ఆపాడనే స్టోరీ ప్లాట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ యాక్షన్ సినిమా సీక్వెన్స్ తీయడంలో డైరెక్టర్ మిత్ర ప్రూవ్ చేసుకోవడంతో సర్దార్ 2 పై ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాతలు ఎస్. లక్ష్మణ్ కుమార్ మరియు ఇషాన్ సక్సేనా కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా విజయ్ వేలుకుట్టి ఎడిటర్ గా పని చేస్తున్నాడు.