భద్రాచలంలో పోటెత్తిన గోదావరి తీరం

కార్తీక మాసం తొలి సోమవారం భద్రాచలంలోని గోదావరి తీరం భక్తులతో పోటెత్తింది. తెల్లవారు జామునే మహిళలు గోదావరికి తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక దీపాలు వెలిగించి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పూలు, వస్త్రాలు సమర్పించారు.

కార్తీక దీపాలను నదిలో వదిలారు. శివాలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఉపవాస దీక్షలు చేపట్టారు. సాయంత్రం ఆకాశదీపాలను వెలిగించి భక్తిప్రవత్తులతో పూజలు చేశారు. దీక్షను విరమించారు. శివునికి ఇష్టమైన అభిషేకాలు నిర్వహించారు. భద్రాచలం,వెలుగు: