
యంగ్ హీరో కార్తికేయ గుమ్మికండ(karthikeya Gummikonda), నేహా శెట్టి(Neha shetty) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012(Bedurulanka 2012). కొత్త దర్శకుడు క్లాక్స్(Clax) తెరకెక్కించిన ఈ సినిమాకి స్వరభ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేయగా.. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బెదురులంక2012 సినిమా ఎలా ఉంది? బెదురులంక ఆడియన్స్ ను బెదిరించిందా? లేక నవ్వించిందా? సినిమా చూశాక ఆడియన్స్ రియాక్షన్ ఏంటి అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ: 2012 సంవత్సరంలో యుగాంతం అవుతుందాని వార్తలు వినిపించాయి. ఆ సమయంలో బెదురులంక అనే చిన్న పల్లెటూరులో జరిగిన కథే బెదురులంక2012. యుగాంతం జరుగుతుంది అని నమ్మిన బెదురులంక ప్రజలు ఆ సమయంలో ఎలా ప్రవర్తించారు? వారు ఎదుర్కొన్న పరిస్థితులేంటి? యుగాంతం ఆపడానికి వాళ్ళు ఎం చేశారు? అందులో హీరో పాత్రఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: యుగాంతం కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ బెదురులంక వాటికి బిన్నం. మిగతా సినిమాల్లో లాగా సీరియస్ గా కాకుండా చాలా ఫన్నీ వేలో చూపించారు దర్శకుడు క్లాక్స్. తలిసిన కథే అయినప్పటికి దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. నిజానికి చెప్పాలంటే ఈ సినిమాను కాపాడింది కామెడీ అనే చెప్పాలి. అజయ్ ఘోష్, శ్రీకాంత అయ్యగారు, వెన్నెల కిషోర్, జబర్దస్త్ రాంప్రసాద్, గెటప్ శ్రీను, సత్య, కశీరాజు చేసిన కామెడీ నెక్స్ట్ లెవల్లో పండింది. ఓపక్క కథను నడిపిస్తూ.. మరోపక్క కామెడీని జెనెరేట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. దీంతో ఆడియన్స్ ఫుల్ గా ఎంటర్టైన్ అవడం గ్యారంటీ. సినిమాను మొదలుపెట్టడం డైరెక్ట్ కథలోకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా చేశారు దర్శకుడు. సినిమాలో పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గానీ సూపర్ గ ప్లస్ అయ్యాయి. మొత్తంగా బెదురులంక 2012 సినిమా చాలా బాగుంది.
నటీనటులు: హీరో కార్తికేయ చాలా బాగా చేశాడు. ఆయన పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేశాడు. ఆయన పాత్రలో కూడా చాలా ఫన్ యాంగిల్ ఉంటుంది. అది కూడా ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక నేహా శెట్టి పాత్ర కూడా బాగానే ఉంది. గ్లామర్ గా కూడా కనిపించి ఆడియన్స్ ను మెప్పించింది. ఇక సినిమా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అజయ్ ఘోష్, శ్రీకాంత అయ్యగారు, వెన్నెల కిషోర్, జబర్దస్త్ రాంప్రసాద్, గెటప్ శ్రీను, సత్య, కశీరాజు గురించి. బెదురులంక సినిమాను నిలబెట్టింది వెళ్లే అని చెప్పాలి. తమ నటనతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు.
ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడియన్స్ ను విపరీతంగా నవ్విస్తున్న బెదురులంక 2012