బోగస్..మోర్ బోగస్..మోస్ట్ బోగస్ అంటున్న కార్తీ చిదంబరం

బోగస్..మోర్ బోగస్..మోస్ట్ బోగస్ అంటున్న కార్తీ చిదంబరం

వీసా కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం. కార్తీ చిదంబరాన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి హోంమంత్రిగా ఉన్న సమయంలో 263మంది చైనీయులు అక్రమ వీసాలు పొందడంలో సాయం చేశారని ఆయనమీద ఆరోపణలున్నాయి. ఈ కేసులో గతవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా కార్తీ చిదంబరం మాట్లాడుతూ..తనపై నమోదైన ప్రతి కేసు బోగస్ కేసన్నారు. వీసా పొందడంలో ఒక్క చైనీయుడికి కూడా తాను సహకరించలేదని చెప్పారు. కేంద్రం తనను భయపెట్టాలని మరోసారి సీబీఐ, ఈడీలకు పనిచెప్పందని..అయితే తాను భయపడే ప్రసక్తేలేదని కార్తీ చిదంబరం స్పష్టం చేశారు.

కాగా ఈ కేసులో మే 17న కార్తీచిదంబరం సన్నిహితులు ఎస్.భాస్కరరామన్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. వేదాంత గ్రూప్ కు చెందిన టీఎస్పీఎల్ కంపెనీ నుండి చిదంబరం 50లక్షలు లంచం తీసుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం 263 మంది చైనా కార్మికులకు వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో సదరు కంపెనీ కార్తీ చిదంబరానికి డబ్బులు చెల్లించిందని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగానే ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అయితే బుధవారం ఉదయం 11గంటలకు విచారణకు హాజరుకావాలని గతంలోనే కార్తీచిదంబరంకు సమన్లు జారీ చేసింది. అయితే బుధవారం ఉదయం కార్తీ తరుపు న్యాయవాది సీబీఐ విచారణకు హాజరుకాగా..న్యాయవాదిని విచారించాల్సిన అవసరం లేదని..కార్తీ చిదంబరమే నేరుగా విచారణకు రావాలని సీబీఐ స్పష్టం చేసింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యారు.

 

మరిన్ని వార్తల కోసం

ప్రధాని వెళ్లిన తర్వాత తిరిగి హైదరాబాద్ కు సీఎం కేసీఆర్

కేటీఆర్ ​ఆర్డరేసినా నెమ్మదిగానే అభివృద్ధి పనులు