కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్‌లో నటించిన హారర్ కామెడీ చిత్రం ‘భూల్ భూలైయా 3’. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ కీలకపాత్రలు పోషించారు. అనీశ్ బజ్మీ దర్శకుడు. దీపావళి కానుకగా నవంబర్ 1న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు కార్తిక్ ఆర్యన్, విద్యా బాలన్ హాజరై.. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన గత రెండు చిత్రాల తరహాలో ఈ చిత్రం కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెప్పారు.