బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..? కార్తీక్ ఆర్యన్ డీవై పాటిల్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ డిగ్రీ చేయడానికి ముంబైకి వచ్చాడు. ఈ క్రమంలో 2011లో వచ్చిన ప్యార్ కా పంచ్‌నామా అనే సినిమాలో నటించే ఆఫర్ రావడంతో చదువుకు బ్రేక్ ఇచ్చి సినిమాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత సినీ కెరీర్ బిజీలో పడిలో చదువుకి సమయం కేటాయించలేకపోయాడు. దీంతో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చెయ్యడానికి 10 ఏళ్ళకి పైగా పట్టింది.
శనివారం హీరో కార్తీక్ ఆర్యన్ ముంబైలోని డివై పాటిల్ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ వేడుకకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను ఇటీవలే చేసిన డిగ్రీ పట్టాని అందుకున్నాడు. ఈ విషయాన్ని కార్తీక్ ఆర్యన్ తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకి తెలియజేశాడు. ఇందులోభాగంగా ఓ వీడియో కూడా షేర్ చేశాడు. ఈ వీడియోలో కార్తీక్ ఆర్యన్ తన విజయ్ పాటిల్ తన ఫెవరెట్ లెక్చరర్ అని, ఈ యూనివర్సిటీ నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఇచ్చిందని తెలిపాడు.
ALSO READ | Naanaa Hyraanaa Song: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... నేటి నుంచి థియేటర్స్ లోకి నానా హైరానా సాంగ్..
తర్వాత కాలేజీ జెర్సీ ప్రదర్శించి, స్టూడెంట్స్ తో కలిసి భూల్ భూలైయా 3 టైటిల్ సాంగ్ కి స్టెప్పులేశాడు. స్టూడెంట్స్, ఇతర లెక్చరర్లతో కలసి ఫోటోలు దిగాడు. ఈ వీడియో కి "బ్యాక్‌బెంచ్‌లో కూర్చోవడం నుండి నా స్నాతకోత్సవం కోసం వేదికపై నిలబడటం వరకు - ఇది ఎంత గొప్ప ప్రయాణం" అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో కొందరు నెటిజన్లు స్పందిస్తూ కార్తీక్ ఆర్యన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది రిలీజ్ అయిన భూల్ భూలైయా 3 సినిమాతో కార్తీక్ ఆర్యన్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ని రూ.150 కోట్లు బడ్జెట్ తో హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించగా వరల్డ్ వైడ్ దాదాపుగా రూ.420 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఆషికీ 3 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.