OTT OTT Horror Comedy: ఓటీటీకి వస్తున్న సూపర్ హిట్ హారర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT OTT Horror Comedy: ఓటీటీకి వస్తున్న సూపర్ హిట్ హారర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కార్తిక్ ఆర్యన్‌‌‌‌ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటించిన హారర్ కామెడీ  చిత్రం ‘భూల్ భూలైయా 3’(Bhool Bhulaiyaa 3). విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ కీలకపాత్రలు పోషించారు.  అనీశ్ బజ్మీ దర్శకుడు.దీపావళి కానుకగా నవంబర్ 1న పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా ఈ మూవీ రిలీజైంది. ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇపుడీ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.

భూల్ భూలైయా 3 ఓటీటీ:

కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్యా 3..థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ట్రైలర్ బాగుండటంతో ఫస్ట్ నుంచే మూవీ మీద అంచనాలు పెరిగాయి. నవంబర్ 1న రిలీజైన ఈ మూవీని క్రిస్మస్ కానుకగా ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు టాక్. డిసెంబర్ 25కి ఓటీటీలోకి వస్తుందని సమాచారం. అయితే, 2025 జనవరి ఫస్ట్ వీక్ లో  ఓటీటీకి వస్తుందనుకున్న ఈ మూవీ.. క్రిస్మస్ సందర్బంగా మేకర్స్ తీసుకురానున్నారు.  రానున్న ఈ రెండ్రోజుల్లో మేకర్స్ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 బ్యానర్లపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మించారు. 

భూల్ భూలైయా 3 కలెక్షన్స్:

కోల్‍కతా బ్యాక్‍డ్రాప్‍లో హారర్ అండ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి కలెక్షన్లు బానే వచ్చాయి. దాదాపు రూ.150కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా సుమారు రూ.417 గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. 2024 లో శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ 2 మూవీ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. కొంత కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ రెండు సినిమాల హిట్ తో మంచి రోజులు వచ్చాయనే బలాన్ని ఇచ్చాయి.