యాదగిరిగుట్టకు సంతరించుకున్న కార్తీక కళ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం కార్తీక కళ సంతరించుకుంది. కార్తీకమాసానికి తోడు ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి గుట్టకు భక్తులు అధి క సంఖ్యలో వచ్చారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట పట్టింది. కార్తీక దీపారాధనలో భాగంగా ప్రధానాలయం, శివాలయం, విష్ణుపుష్కరిణి, వ్రత మండపం, లక్ష్మీపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్ల వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ఇక ఆదివారం ఒక్కరోజే 780 మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్నారు. కేవలం ఈ వ్రతాల నిర్వహణ ద్వారానే ఆలయానికి రూ.6.24 లక్షల ఆదాయం వచ్చింది.