మౌత్‌‌ టాక్‌‌తో మంచి ఆదరణ

మౌత్‌‌ టాక్‌‌తో మంచి ఆదరణ

కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ  నిర్మించిన చిత్రం ‘భజే వాయు వేగం’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలియజేస్తూ..  గురువారం మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. కార్తికేయ మాట్లాడుతూ ‘హీరోగా ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఎలాంటి సినిమా చేయాలో  అర్థం కాని టైమ్‌‌లో డైరెక్టర్ ప్రశాంత్  ఈ కథతో సక్సెస్  అనే టార్చిలైట్ ఇచ్చాడు.

ఈ మూవీ కలెక్షన్స్, షోస్ పెరగడం గురించి మా నిర్మాతలు మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపిస్తోంది’ అని చెప్పాడు. సక్సెస్‌‌లో భాగమవడం ఆనందంగా ఉందని చెప్పింది ఐశ్వర్య మీనన్.  మౌత్‌‌ టాక్‌‌తోనే ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతోందని దర్శకుడు ప్రశాంత్ రెడ్డి అన్నాడు.  నటుడు  రాహుల్ టైసన్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.