భారత్ తరపున టెస్టులో ట్రిపుల్ సెంచరీ ఒక్కసారిగా అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు కరుణ్ నాయర్. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన తన తొలి సిరీస్‌లోనే కరుణ్ ఈ ఘనతను సాధించడం విశేషం. చెన్నై వేదికగా జరిగిన ఈ టెస్టులో 381 బంతుల్లో 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Also Read:-బ్యాడ్మింటన్‌లో నేను కోహ్లీలా ఆడాలి
ఈ ఇన్నింగ్స్ తర్వాత కరుణ్ నాయర్ తన పేలవ ఫామ్ తో భారత జట్టులో కొనసాగలేకపోయాడు. 2017లో భారత్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన నాలుగు ఇన్నింగ్స్ ల్లో నిరాశపరిచాడు. దీంతో భారత జట్టులో స్థానం కోల్పోయాడు. పేలవ ఫామ్ తో భారత జట్టులో స్థానం కోల్పోయిన ఈ కర్ణాటక ప్లేయర్.. మరోసారి సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. మహారాజా టీ20 ట్రోఫీలో భాగంగా కరుణ్ నాయర్ 43 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రావడమే తన లక్ష్యమని కరుణ్ తన మనసులో మాట బయట పెట్టాడు.
నాయర్ మాట్లాడుతూ.. "దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఇప్పుడు నా ఏకైక లక్ష్యం. మళ్ళీ భారత టెస్ట్ క్రికెట్ జట్టులోకి రావాలని ఆశిస్తున్నా. కష్టపడి భారత జట్టులో స్థానం సంపాదిస్తాననే నమ్మకం నాకుంది. నేను గత ఏడాది కాలంలో అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని సవాలుగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను". అని ట్రిపుల్ సెంచరీ వీరుడు తెలిపాడు.
Karun Nair aims for Test cricket comeback
— SportsTiger (@The_SportsTiger) August 29, 2024
📷: BCCI#testcricket #karunnair #teamindia pic.twitter.com/Ky4mD2PYbg