Maharaja T20: టీమిండియాకు ఆడాలని ఉంది.. 43 బంతుల్లోనే భారత క్రికెటర్ సెంచరీ

Maharaja T20: టీమిండియాకు ఆడాలని ఉంది.. 43 బంతుల్లోనే భారత క్రికెటర్ సెంచరీ

భారత్ తరపున టెస్టులో ట్రిపుల్ సెంచరీ ఒక్కసారిగా అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు కరుణ్ నాయర్. పేలవ ఫామ్ తో భారత జట్టులో స్థానం కోల్పోయిన ఈ కర్ణాటక ప్లేయర్.. మరోసారి సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. మహారాజా టీ20 ట్రోఫీలో భాగంగా కరుణ్ నాయర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మైసూర్ వారియర్స్  జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కరుణ్.. సోమవారం (ఆగస్టు 19) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో 43 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. 

మంగళూరు డ్రాగన్స్ బౌలింగ్‌పై పూర్తి ఆధిపత్యం చూపిస్తూ  48 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్‌ 258.33 గా ఉంది. కరుణ్ నాయర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మైసూర్ డ్రాగన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత కరుణ్ నాయర్ భారత టెస్ట్ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. కెరీర్ ప్రారంభంలోనే ఈ కర్ణాటక ప్లేయర్ భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ చేసి సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన మైసూర్ డ్రాగన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. వర్షం కారణంగా మైసూర్ వారియర్స్ మంగళూరు డ్రాగన్స్‌ టార్గెట్ ను 14 ఓవర్లలో 166 పరుగులకు సవరించారు. లక్ష్య ఛేదనలో డ్రాగన్స్ 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులకే పరిమితమైంది. దీంతో మైసూర్ డ్రాగన్స్ 27 పరుగుల తేడాతో గెలిచింది.