DC vs RCB: అప్పుడు గిల్, ఇప్పుడు పటిదార్: కరుణ్ నాయర్ మైండ్ బ్లోయింగ్ రనౌట్

DC vs RCB: అప్పుడు గిల్, ఇప్పుడు పటిదార్: కరుణ్ నాయర్ మైండ్ బ్లోయింగ్ రనౌట్

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ తన ఫీల్డింగ్ తో ఔరా అనిపిస్తున్నాడు. గ్రౌండ్ లో మెరుపు వేగంతో కదులుతూ స్టార్ బ్యాటర్లకు షాక్ ఇస్తున్నాడు. ముఖ్యంగా రనౌట్ ల విషయంలో అస్సలు గురి తప్పట్లేదు. ఈ సీజన్ లో మరో అద్భుతమైన రనౌట్ తో ప్రత్యర్థి ఆర్సీబీకి షాక్ ఇచ్చాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం (ఏప్రిల్ 27) రాయల్ ఛాలెంజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పటిదార్ ను తన మెరుపు త్రో తో ఔట్ చేసి బెంగళూరును కష్టాల్లో నెట్టాడు. 

ఆర్సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ చివరి బంతిని కోహ్లీ ముందుకొచ్చి డిఫెన్స్ ఆడాడు. నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న పటిదార్ సింగిల్ కోసమని కొంచెం ముందుకొచ్చాడు. అయితే మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న కరుణ్ నాయర్ మెరుపు వేగంతో విసిరిన త్రో విసరడంతో బాల్ స్టంప్స్ కు తగిలింది. ఈ లోపు పటిదార్ డైవ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. రీప్లేలో ఔట్ అని తేలడంతో నిరాశగా పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. రెప్పపాటులో జరిగిన ఈ సీన్ ఒక్కసారిగా బెంగళూరు ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది. 

కరుణ్ నాయర్ అంతకముందు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో తన డైరెక్ట్ త్రో విసిరి గిల్ ను ఔట్ చేశాడు. మరోసారి అదే ఫలితాన్ని రిపీట్ చేయడం విశేషం. పటిదార్ ఔట్ కావడంతో బెంగళూరు 26 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 163 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో ఓవర్లో అక్షర్ పటేల్ ఒకే ఓవర్లో ఓపెనర్ బెతేల్, పడికల్ ను ఔట్ చేసి ఆర్సీబీకి బిగ్ షాక్ ఇచ్చాడు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.