
ఐపీఎల్ 2025 లో ముంబైతో తొలి మ్యాచ్ ఆడి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ నాయర్.. రెండో మ్యాచ్ లో దురదృష్టవశాత్తు డకౌటయ్యాడు. బుధవారం (ఏప్రిల్ 16) అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మొదటి బంతి అభిషేక్ పోరెల్ కు సందీప్ శర్మ స్లో బాల్ వేశాడు. బంతిని టచ్ చేసి పోరెల్ సింగిల్ తీద్దామని ప్రయత్నించాడు. అయితే బాల్ అక్కడే ఉండడంతో వెంటనే వెనకడుగు వేశాడు.
ఈ లోపు నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న కరుణ్ నాయర్ పిచ్ మధ్యలోకి వచ్చాడు. అతను తిరిగి క్రీజ్ చేరుకునే లోపు సందీప్ శర్మ రనౌట్ చేశాడు. రనౌట్ రూపంలో డకౌట్ కావడంతో కరుణ్ తీవ్ర నిరాశతో పెవిలియన్ కు చేరాడు. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన తర్వాత తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక అక్కడ ఉన్న వస్తువులను బలంగా గుద్దుతూ సహనం కోల్పోయాడు. తొలి మ్యాచ్ లో 88 పరుగులు చేసి అద్భుతంగా రాణించిన కరుణ్.. తర్వాత మ్యాచ్ లోనే రనౌట్ రూపంలో డకౌట కావడం విచారానికి గురి చేస్తుంది.
►ALSO READ | DC vs RR: బ్యాటింగ్‌లో ఢిల్లీ ధనాధన్.. రాజస్థాన్ ముందు బిగ్ టార్గెట్!
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ లో అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49: 5 ఫోర్లు, ఒక సిక్సర్), రాహుల్ (38) భాగస్వామ్యంతో పాటు అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34:4 ఫోర్లు, 2 సిక్సర్లు) స్టబ్స్ (18 బంతుల్లో 34: 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 49 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హసరంగా, తీక్షణ తలో వికెట్ తీసుకున్నారు.
Karun Nair very angry after his Run Out. #DCvsRR pic.twitter.com/FU32tXeecF
— VIKAS (@VikasYadav69014) April 16, 2025