కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌ సెంచరీ.. అధిక్యంలో విదర్భ

కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌ సెంచరీ.. అధిక్యంలో విదర్భ

నాగ్‌‌‌‌పూర్‌‌‌‌: కేరళతో రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ ఆధిపత్యమే కొనసాగుతోంది. కెప్టెన్‌‌‌‌ కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌ (132 బ్యాటింగ్‌‌‌‌) సెంచరీతో చెలరేగడంతో.. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌కు విదర్భ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 90 ఓవర్లలో 249/4 స్కోరు చేసింది. నాయర్‌‌‌‌తో పాటు అక్షయ్‌‌‌‌ వాడ్కర్‌‌‌‌ (4 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. పార్త్‌‌‌‌ రేఖడే (1), ధ్రువ్‌‌‌‌ షోరే (5) ఫెయిల్‌‌‌‌ కావడంతో విదర్భ 7/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో కరుణ్‌‌‌‌ ... డానిష్‌‌‌‌ మాలేవర్‌‌‌‌ (73)తో మూడో వికెట్‌‌‌‌కు 182, యష్‌‌‌‌ రాథోడ్‌‌‌‌ (24)తో నాలుగో వికెట్‌‌‌‌కు 49 రన్స్‌‌‌‌ జత చేశాడు. తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం విదర్భ 286 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో కొనసాగుతోంది.