RC 16: అద్భుతమైన లుక్లో కన్నడ శివన్న.. రామ్ చరణ్ సినిమా సెట్స్‌లో జాయిన్!

RC 16: అద్భుతమైన లుక్లో కన్నడ శివన్న.. రామ్ చరణ్ సినిమా సెట్స్‌లో జాయిన్!

దర్శకుడు బుచ్చిబాబు, హీరో రామ్ చరణ్ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ (RC 16). ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్రలో నటిస్తున్నాడు. లేటెస్ట్గా (మార్చి 5న) శివ రాజ్ కుమార్ లుక్ టెస్ట్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే శివన్న   RC 16 షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు తెలిపారు.

ఇందుకు సంబంధించి ఫోటో షేర్ చేస్తూ ' కరుణాడ చక్రవర్తి నిమ్మశివన్న త్వరలో RC16 సెట్స్‌లో జాయిన్ అవుతారు. అతని పాత్ర కోసం సినిమా సెట్ ఎదురుచూస్తోంది" అని తెలిపారు. తన గొప్ప స్క్రీన్ ప్రెజెన్స్‌కు పేరుగాంచిన శివన్న.. RC 16 లో తన పాత్రకు ఎలాంటి గాంభీర్యాన్ని తీసుకురానున్నాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ మృగం లాంటి మోడ్‌లోకి మారడానికి దాదాపు రెండు నెలలు పట్టింది. శరీర మార్పు కోసం ప్రఖ్యాత బాడీ కోచ్ శివోహం వద్ద శిక్షణ పొందాడు. ఈ మూవీ కథ ఉత్తరాంధ్ర నేపథ్యంలో వస్తుండటంతో గ్రామీణ, భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లేలా బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతిదీ జాగ్రత్త తీసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు, 'మిర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ALSO READ | Ram Gopal Varma: ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన వర్మ

ఇకపోతే, RC 16 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వరుసగా రెండు కీలక షెడ్యూల్ను పూర్తిచేసుకుని, నెక్స్ట్ షెడ్యూల్ని ఫిక్స్ చేసుకుంది. 2024 ఏడాది చివర్లో ఫస్ట్ షెడ్యూల్ కర్ణాటకలోని మైసూరులో జరగగా, సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో జరుపుకుంది. ఇక మూడో షెడ్యూల్ షూటింగ్ ఢిల్లీలో జరగనుందని సమాచారం. ఢిల్లీలోని పార్లమెంట్, జామా మసీదు వంటి ప్రసిద్ధ ప్రదేశాలలో కొన్ని కీలకమైన సీన్స్ను తీయబోతున్నారట దర్శకుడు బుచ్చిబాబు.

పీరియాడికల్‌‌ బ్యాక్‌‌ డ్రాప్‌‌ స్పోర్ట్స్‌‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌‌చరణ్‌‌ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. రామ్ చరణ్ కి జోడీగా జాన్వి కపూర్ నటిస్తోంది. ఇది జాన్వీకి తెలుగులో రెండవ ప్రాజెక్ట్. ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌‌‌‌తో దీన్ని నిర్మిస్తున్నారు.