గద్వాల, వెలుగు: ఫ్యాషన్, రెడిమేడ్ వస్త్ర ప్రపంచంలో కాసం ఫ్యాషన్స్ నూతన ఒరవడి సృష్టించిందని ప్రముఖ హరోయిన్ మెహ్రీన్ అన్నారు. జోగులాంబ గద్వాల్ కృష్ణవేణి చౌక్‌లో బుధవారం ఉదయం కాసం ఫ్యాషన్స్ షోరూమ్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మెహ్రీన్ మాట్లాడుతూ.. సుమారు 75 సంవత్సరాల వస్ర్త వ్యాపార అనుభవం కలిగిన కాసం పుల్లయ్య కుటుంబ సభ్యులు యువతీ, యువకులకు, స్ర్తీలకు, పురుషులకు లేటెస్ట్ వైరెటీలు అందించడంలో ముందుంటారన్నారు.
గద్వాల్లోనే అతి పెద్దదైన షోరూం ప్రారంభించారని చెప్పారు. మెహ్రీన్ రాక తెలుసుకున్న ప్రజలు ఉదయం నుంచి తరలివచ్చారు. కార్యక్రమంలో కాసం డైరెక్టర్లు కాసం మల్లిఖార్జున్, కాసం నమశివాయ, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, కాసం ప్రణీత్, కాసం సాయిగుప్త, యాంసాని ప్రవీణ్, పుల్లూరు అరుణ్ కుమార్, వరుణ్, విశాల్, అరుణ్ ప్రముఖులు పాల్గొన్నారు.