టీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అన్ని జిల్లాల్లోనూ క్యాడర్ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన కాసాని .. ఫిబ్రవరి మొదటివారంలో నిజామాబాద్ లోనూ భారీ పబ్లిక్ మీటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తొలి టిక్కెట్ ఏ సామాజిక వర్గానికి ఇస్తారో ముందుగానే స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తొలి టికెట్ నాయి బ్రాహ్మణులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మిగతా 11 కులాల వారికి టిక్కెట్ ఇస్తామని చెప్పారు.
ఖమ్మం సభ కన్నా నిజామాబాద్ మీటింగ్ విజయవంతమవుతుందని కాసాని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. సంక్రాంతిలోపు కొత్త కమిటీ వేస్తామన్న ఆయన.. ఇతర పార్టీల నాయకులు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు.