ఈ చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.. అంతలా ఏముంది?

ఈ చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.. అంతలా ఏముంది?

ఏది ఏమైనా మలయాళ సినిమాలో ఉండే సహజత్వం వేరే భాషల సినిమాల్లో కనిపించదు. అందుకే ఆ ఇండస్ట్రీ సినిమాలను ఎక్కువమంది లైక్ చేస్తారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా కేవలం పాయింట్ ను పట్టుకుని చాలా ఇంట్రెస్టింగ్గా కథని నడిపిస్తారు అక్కడి మేకర్స్.


ఆ కోవలోకే వస్తుంది కాసర్ గోల్డ్ మూవీ. సెప్టెంబర్ 1న థియేటర్స్ లో వచ్చిన ఈ సినిమా ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. చాలా సింపుల్ కథతో వచ్చిన ఈ సినిమాలకు అటు థియేటర్స్ లో, ఇటు ఓటీటీలో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కథగా చూసుకుంటే చాలా చిన్నగా ఉంటుంది. పైసల్ అనే ఓ మధ్యతరగతి యువకుడు కులాంతర వివాహం చేసుకొని భార్య, తల్లి, పాపతో జీవనాన్ని సాగిస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకరోజు తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా.. 
కోట్ల విలువచేసే బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహాన్ని డీ కొడతారు. కాసేపటికి ఆ వాహనంలో బంగారం కనిపించదు. దీంతో పైసల్ బ్యాచ్ ఆ బంగారాన్ని కొట్టేసుంటారని వారు భావిస్తారు. ఆతరువాత ఎం జరిగింది? వాహనంలో బంగారం ఎవరు కోటేశారు?ఫైసల్ దగ్గరే ఉందా? అనేది మిగితా కథ? 

Also Read :- భగవంత్ కేసరి కలెక్షన్ల జోరు

చాల సింపుల్ కథను దర్శకుడు మృదుల నాయర్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. కథను మొదలుపెట్టిన విధానం, నడిపించిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కథలోని పాత్రల ఎమోషన్స్ కు యాక్షన్స్ ను టచ్ ఇస్తూ.. నెక్స్ట్ లెవల్లో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. అంతేకాదు.. తరువాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించడంలో కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఈ సీన్స్ అన్నీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. ఇక సినిమాకు విష్ణు విజయ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక మొత్తంగా చెప్పాలంటే... ఈ మధ్యకాలంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో చాలా బెటర్ గా ఉంది ఈ సినిమా. ట్విస్టులు, సస్పెన్స్ ను ఎంజాయ్ చేసేవారు ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు.