అమెరికా సెనెట్లో భారత సాంప్రదాయం.. పేరెంట్స్ కాళ్లు మొక్కిన FBI డైరెక్టర్ కాష్ పటేల్

అమెరికా సెనెట్లో భారత సాంప్రదాయం.. పేరెంట్స్ కాళ్లు మొక్కిన FBI డైరెక్టర్ కాష్ పటేల్

ఎఫ్ బీఐ డైరెక్టర్గా ఎన్నికైన భారత సంతతి కాష్ పటేల్ గురువారం సెనెట్ జ్యుడిషియరీ కమిటీ ముందు కన్ఫర్మేషన్ ఇయరింగ్ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం నెలకొంది. తన కుటుంబ సభ్యుల పరిచయం చేస్తున్న సందర్భంలో  భారతీయ సంప్రదాయాలను పాటించారు.జై శ్రీకృష్ణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతేకాదు తన తండ్రి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

గురువారం (జనవరి 31) న అమెరికా సెనెట్ లో జ్యుడిషియరీ కమిటీ ముందు కన్ఫర్మేషన్ ఇయరింగ్ కు హాజరయ్యారు కాష్ పటేల్.. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. గుజరాతీ వారసత్వం కలిగిన పటేల్ న్యాయవాది. సెనేట్‌లో విచారణకు ముందు తన తల్లి ,తండ్రి పాదాలను తాకడానికి నమస్కరిస్తున్నట్లు వీడియోలో కనిపించారు. 

Also Read : అక్రమ వలసదారులను వెనక్కి పంపే ..చట్టంపై ట్రంప్​ సంతకం

మరొక వైరల్ వీడియోలో.. FBI డైరెక్టర్‌గా తన కన్ఫర్మేషన్ ఇయరింగ్ లో సెనేట్ జ్యుడిషియరీ కమిటీ ముందు హాజరైనప్పుడు అతని తల్లిదండ్రులను, సోదరిని పరిచయం చేస్తూ కనిపించారు. 
44 ఏళ్ల ఇండియన్ ఆరిజన్ అయిన కాష్ పటేల్ ను స్వతహాగా లాయర్.. ఇటీవల పటేల్ ను  ఎఫ్ బీఐ డైరెక్టర్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు.