భగవద్గీత సాక్షిగా కాష్​ పటేల్ ప్రమాణం.. యూఎస్ ఎఫ్బీఐ డైరెక్టర్గా భారత సంతతి వ్యక్తి

భగవద్గీత సాక్షిగా కాష్​ పటేల్ ప్రమాణం.. యూఎస్ ఎఫ్బీఐ డైరెక్టర్గా భారత సంతతి వ్యక్తి

వాషింగ్టన్:  అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ  ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్(ఎఫ్​బీఐ)​ డైరెక్టర్​గా భారత సంతతికి చెందిన కాష్​పటేల్​ ప్రమాణం చేశారు. శుక్రవారం వైట్​హౌస్​లో ఆయన చేత అటార్నీ జనరల్​ పామ్​ బోండీ ప్రమాణ స్వీకారం చేయించారు.

భారత మూలాలు ఉన్న కాష్​ పటేల్​ భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేయడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆయన గర్ల్​ఫ్రెండ్​ అలెక్సీస్​ విల్​కిన్స్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాష్​ పటేల్​ మాట్లాడుతూ.. ఎఫ్‌‌‌‌బీఐ లో జవాబుదారీతనం ఉండేలా చూస్తానన్నారు.