
న్యూఢిల్లీ, వెలుగు: ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులపై ఢిల్లీలోని హోంమంత్రిత్వ శాఖ నుంచి ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జమ్మూకాశ్మీర్ డీజీపీ నళిని ప్రభాత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాశ్మీర్‌లో పర్యాటకుల భద్రతపై ఆరా తీశారు. పర్యాటకులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని ఆదేశించారు.
అలాగే, జమ్మూకాశ్మీర్‌లోని హోటళ్ల యజమానులతోనూ సంజయ్ ఫోన్‌లో మాట్లాడారు. టూరిస్టులకు కావాల్సిన సౌకర్యాలు, భద్రత, రక్షణ విషయంలో సహకరించాలని కోరారు. కాగా, కాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. తెలంగాణకు చెందినోళ్లు ఎవరైనా ఉంటే సమాచారం కోసం అధికారులు వందన (9871999044), హైదర్ అలీ నఖ్వీ (9971387500)ని సంప్రదించాలని సూచించింది.