
లాహోర్: కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటామని 26/11 ముంబై దాడుల మాస్టర్‌మైండ్, లష్కరేతోయిబా(ఎల్ఈటీ) చీఫ్హఫీజ్ సయీద్కొడుకు తల్హా సయీద్ ప్రకటించారు. ఇండియా నుంచి వేరు చేసి పాకిస్తాన్లో కలుపుతామని.. ఇందుకోసం ఎంతవరకైనా పోరాడుతానని తెలిపారు. గురువారం ‘కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం’ సందర్భంగా లాహోర్‌లో నిర్వహించిన ర్యాలీలో తల్హా సయీద్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఇండియా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఏది ఏమైనా కాశ్మీర్‌ను ఇండియా నుంచి వేరు చేస్త” అంటూ ప్రతిజ్ఞ చేశాడు. పాక్ ప్రభుత్వం తన విధానాన్ని సమీక్షించుకోవాలని, జైలులో ఉన్న తన తండ్రి హఫీజ్ సయీద్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఈటీని టెర్రరిస్టు సంస్థగా ప్రపంచ దేశాలు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ఇది తన తండ్రిని కించపరచడానికి ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తప్పుడు ప్రచారం అని విమర్శించారు.
‘కాశ్మీర్ ముస్లింలదే, ఇండియా నుంచి కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటామని నేను మోదీని హెచ్చరిస్తున్న. అది త్వరలోనే పాకిస్తాన్లో భాగం అవుతుంది’’ అని తల్హా అన్నారు. తల్హా సయీద్.. 2024 పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్మర్కాజీ ముస్లిం లీగ్(పీఎంఎంఎల్) పార్టీ అభ్యర్థిగా లాహోర్‌లోని ఎన్ఏ122 నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. అయితే అతడికి కేవలం 2,041 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.