నేనేం మలాలా కాదు: కాశ్మీర్ యాక్టివిస్ట్ యానా మీర్

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ కు చెందిన యాక్టివిస్ట్ యానా మీర్ బ్రిటన్ పార్లమెంట్ బిల్డింగులో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టడీ సెంటర్ నిర్వహించిన ‘సంకల్ప్ దివస్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘నేనేం మలాలా యూసఫ్ జాయ్ కాదు. ఎందుకంటే నాకెప్పుడూ నా దేశం నుంచి పారిపోవాల్సిన అవసరం రాదు. నేను నా దేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నాను” అని చెప్పారు.

‘‘నా దేశాన్ని మలాలా నిందిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్ లో అణచివేత ఉందంటూ అసత్యాలు చెబు తున్నారు. ఇలాంటి సోషల్ మీడియా ‘టూల్ కిట్ మెంబర్స్’, ఫారిన్ మీడియా ప్రతినిధులెవరూ కాశ్మీర్ కు రారు. కానీ విదేశాల్లో ఉండి కట్టుకథలు చెబుతుంటారు” అని మండిపడ్డారు. ‘‘మతం ప్రాతిపదికన మమ్మల్ని విడదీయాలనే మీ ప్రయత్నాలను ఇకనైనా ఆపండి. మేం అలా జరగనివ్వం’’ అని అన్నారు.