![ఉగ్రవాదుల కాల్పుల్లో కశ్మీరీ బీజేపీ నేత, భార్య మృతి](https://static.v6velugu.com/uploads/2021/08/Kashmiri-BJP-leader,-wife-killed-in-terrorist-firing_0as1vHCKex.jpg)
జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్ దార్, అతని భార్యపై కాల్పులు జరిపారు. వారిని హాస్పిటల్ కు తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. దాడిని ఖండించారు జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా. గులామ్ రసూల్ దంపతుల బలిదానం వృథాగా పోదన్నారు. హంతకులకు తగిన శిక్ష పడుతుందని చెప్పారు.