IPL 2025: మాకు ఇంకా ఆశలు ఉన్నాయి.. వెనక్కి తగ్గేదే లేదు: ప్లే ఆఫ్స్‌పై చెన్నై CEO కాన్ఫిడెన్స్

IPL 2025: మాకు ఇంకా ఆశలు ఉన్నాయి.. వెనక్కి తగ్గేదే లేదు: ప్లే ఆఫ్స్‌పై చెన్నై CEO కాన్ఫిడెన్స్

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ డేంజర్ జోన్ లో ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెత్త ప్రదర్శన చేస్తుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన చెన్నై.. ఆ తర్వాత ఆడిన 7 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ పై ఆ జట్టు ఫ్యాన్స్ ఇప్పటికీ ఆశలు వదిలేసుకున్నారు. ముంబైతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోనీ కూడా వచ్చే సీజన్ కోసం మంచి జట్టును తయారు చేస్తాం అని చెప్పాడు. ఈ సీజన్ లో చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరాలంటే అద్బుతంగా జరగాల్సిందే.            

ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో రెండు మాత్రమే గెలిచింది. మిగిలిన 6 మ్యాచ్ ల్లో తప్పకుండా గెలిస్తేనే ప్లే ఆప్స్ కు చేరతాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంటి దారి పట్టడం ఖాయం. నెట్ రన్ రేట్ కూడా మైనస్ ల్లో ఉండడం చెన్నైకు ఉంది. దీంతో తర్వాత ఆడబోయే మ్యాచ్ ల్లో భారీగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెన్నై ఈ మ్యాచ్ లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇన్ని వరుస పరాజయాలు ఉన్నప్పటికీ ఆ జట్టు సీఈఓ కాశి విశ్వనాథన్ తమ జట్టుపై ఇంకా ఆశలు అలాగే ఉంచుకున్నాడు. 

Also Read : ఐపీఎల్ చరిత్రలో అతడే బెస్ట్ ఆస్ట్రేలియన్ ప్లేయర్

కాశి విశ్వనాథన్ మాట్లాడుతూ.. "మేము మా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు. మమ్మల్ని మేము మెరుగుపర్చుకోవడానికి  ప్రయత్నిస్తున్నాము. ఇకపై జరగబోయే మ్యాచ్ ల్లో బాగా రాణించడానికి ప్రయత్నిస్తాము. మా ఫ్రాంచైజీలో మేము ఎప్పుడూ భయంతో వెనకడుగు వేయలేదు. మాకు ఇంకా ఆశలు ఉన్నాయి. తిరిగి పుంజుకుంటామని భావిస్తున్నాం". అని విశ్వనాథన్ పిటిఐ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్ శుక్రవారం (ఏప్రిల్ 25) సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. చెన్నై ఈ మ్యాచ్ లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.