కాసిపేట–1 బొగ్గు గని కార్మికుల ధర్నా..డిప్యూటీ మేనేజర్ ను బదిలీ చేయాలని డిమాండ్​

కాసిపేట–1 బొగ్గు గని కార్మికుల ధర్నా..డిప్యూటీ మేనేజర్ ను బదిలీ చేయాలని డిమాండ్​

కోల్ బెల్ట్, వెలుగు: పనిభారం మోపుతూ, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్వర్లును బదిలీ చేయాలని మందమర్రి ఏరియా కాసిపేట-–1 బొగ్గు గని కార్మికులు డిమాండ్​ చేశారు.  కార్మికుడు శశికాంత్​పనిభారంతో అస్వస్థతకు గురైన నేపథ్యంలో శుక్రవారం మొదటి షిఫ్టు విధుల సమయంలో మేనేజర్​ ఆఫీస్​ ఎదుట బైఠాయించి, ధర్నా చేపట్టారు. వీరికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్​ లీడర్లు మద్దతుగా నిలిచారు.

ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, వైస్​ ప్రెసిడెంట్​బియ్యాల వెంకటస్వామి మాట్లాడుతూ.. డిప్యూటీ మేనేజర్​వెంకటేశ్వర్లు కార్మికులపై పనిభారం మోపుత.. అకారణంగా సస్పెండ్ చేస్తున్నారని, ఛార్జిషీట్ లు ఇస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే ట్రాన్స్​ఫర్​ చేయాలన్నారు.  స్పందించిన యాక్టింగ్​ మేనేజర్ నిఖిల్ అయ్యర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.  డిప్యూటీ మేనేజర్ పై చర్య తీసుకోవాలని ఐఎన్టీయూసీ ఏరియా వైస్​ప్రెసిడెంట్​ భూమయ్య, ఆర్గనైజింగ్​సెక్రటరీ నరేందర్​ డిమాండ్​ చేశారు.