కరీంనగర్, వెలుగు: విద్యారంగ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సమక్షించి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా, కేంద్రమంత్రిగా బండి సంజయ్.. కరీంనగర్ లో కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేలా కేంద్రం నుంచి కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేశ్, జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి హేమంత్, లీడర్లు సందీప్ రెడ్డి, సాయి, వినయ్ రెడ్డి, శ్రావణ్ పాల్గొన్నారు