ఆమనగల్లు, వెలుగు : పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపాలని కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మాడుగుల మండలంలోని అన్నేబోయినపల్లి, సుద్దపల్లి, ఆశిరెడ్డిపల్లి, అంతంపేట, అందుగుల, కూభ్య తండాల్లో నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఆరు గ్యారెంటీ స్కీంలను వివరించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. ప్రచారంలో జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, రామ్ రెడ్డి, కిషన్ రెడ్డి, వెంకటేశ్వర్లు గౌడ్ పాల్గొన్నారు.