కల్వకుర్తి, వెలుగు. కాంగ్రెస్ ప్రభంజనం ప్రారంభమై బీఆర్ఎస్ శకం ముగిసిందని కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డితో కలిసి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మండలంలోని జంగారెడ్డిపల్లి సర్పంచి లింగారెడ్డితో పాటు 100 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఆయన వెంట ఆనంద్ కుమార్, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.