సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం: కసిరెడ్డి నారాయణ రెడ్డి

కల్వకుర్తి, వెలుగు: తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని కాంగ్రెస్  పార్టీ ఆఫీస్​లో కుర్మిద్ద, మార్చాల గ్రామాలకు చెందిన 100 మంది బీఆర్ఎస్  నాయకులు కాంగ్రెస్  పార్టీలో చేరారు. వారికి కసిరెడ్డి పార్టీ కండువాలు కప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్  పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి కల్వకుర్తిని అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఆనంద్ కుమార్, విజయకుమార్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, దామోదర్  పాల్గొన్నారు.

ALSO READ : ఆరు గ్యారెంటీలతో అందరికీ లబ్ధి : కుంభం అనిల్​కుమార్​రెడ్డి