కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి నియోజకవర్గ సమస్యలపై సీఎం కేసీఆర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే పార్టీ మారానని కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించ లేదన్నారు. బుధవారం జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్తో కలిసి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మండలంలోని ఎల్లికట్ట, వెంకటాపూర్ సర్పంచులు రమాదేవి, వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆనంద్ కుమార్, జగన్ పాల్గొన్నారు.