
ఇష్టం లేకుండా తనను హాస్టల్ లో చేర్పించారంటూ ఒ విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. కరీంనగర్ కేంద్రానికి చెందిన హాసిని అనే విద్యార్థిని గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.
అయితే తల్లిదండ్రులు తనని చూడడానికి రాలేదని ఆ విద్యార్థిని మనస్థాపనికి గురై భవనంపై నుంచి దూకింది. దీంతో బాలిక కాలు విరిగింది. వెంటనే స్యూల్ సిబ్బంది కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని దూకడానికి ముందు టీచర్లు వద్దంటూ చాలాసేపు వారించారు. చివరకు విద్యార్థిని కాపాడేందుకు దుప్పట్లు పట్టి ప్రయత్నించారు. కానీ దుప్పటి చిరిగి కింద పడి విద్యార్థిని కాలు విరిగింది.