
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న టీచర్ ను సస్పెండ్ చేస్తేనే భోజనం చేస్తాము అని నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని నాగనూల్ కస్తూర్బా విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. స్టడీ అవర్స్ కు ఆలస్యంగా వచ్చావని 9వ తరగతి విద్యార్థినికి ఇంగ్లీష్ టీచర్ మూడు గంటల పాటు పనిష్మెంట్ ఇచ్చారు.
ఈ విషయంపై అధికారులు ఇటీవల విచారణ చేశారు. దీంతో ఉపాధ్యాయురాలు మాపై కక్ష పెట్టుకుని, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఆ ఉపాధ్యాయురాలను సస్పెండ్ చేసే వరకు మేం భోజనం చేసేదే లేదు అంటూ భీష్ముంచు కూర్చున్నారు. విద్యార్థులకు పలువురు నచ్చే చెప్పే ప్రయత్నం చేసిన వినకుండా వారు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.