స్థానికేతరులకు టికెట్ ఇస్తే మద్దతివ్వం: కాసుల బాలరాజు

బాన్సువాడ, వెలుగు: పోచారం శ్రీనివాస్​రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేద్దామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కాసుల బాలరాజు కోరారు. బుధవారం బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. బాలరాజు మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికి కాకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయిస్తే మద్దతు ఇవ్వమన్నారు. సోషల్ మీడియాలో, పత్రికల్లో వస్తున్న కథనాలను చూసి కార్యకర్తలు ఆందోళన చెందొద్దన్నారు. 

నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తల సలహా మేరకు పార్టీ అధిష్టానం స్థానికులకే టికెట్​ కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ వెంకటరామిరెడ్డి, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్ దేశాయ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాలేక్, బ్లాక్ ఏ బ్లాక్ బీ అధ్యక్షుడు అసద్ బిన్ మోసిన్ చంద్రశేఖర్, వివిధ మండలాల అధ్యక్షులు గణేశ్, పుప్పాల శంకర్, లక్ష్మణ్, పోతురాజ్ శ్రీనివాస్, షాహిద్, అరుణ్, సురేశ్​బాబా, బోయిని శంకర్, పట్టణాధ్యక్షుడు మసాని శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.