- రుద్రారం పట్నం హైవే రెస్టారెంట్యాజమాన్యంపై కాట ఫైర్
పటాన్చెరు, వెలుగు : హోటల్‌కు వచ్చిన కస్టమర్లను కొట్టి పంపుతారా అంటూ కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ఆదివారం మండలంలోని రుద్రారం పట్నం హైవే రెస్టారెంట్ కు భోజనానికి వెళ్లిన లక్డారం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి సోదరులకు అక్కడి రెస్టారెంట్ నిర్వాహకులకు జరిగిన గొడవ చినికి చినికి గాలివానగా మారింది. దీంతో ఇరువురి మధ్య జరిగిన గొడవలో రాజిరెడ్డి సోదరులు తీవ్రంగా గాయపడ్డారు.
పటాన్‌చెరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కాట శ్రీనివాస్ గౌడ్ సోమవారం బాధితులను పరామర్శించారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.