కేసీఆర్‌‌ను గద్దె దింపాలి .. మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం

కరీంనగర్‌ సిటీ, వెలుగు:  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌ను గద్దె దింపాలని మాజీ ఎమ్మెల్యే  కటకం మృత్యుంజయం పిలుపునిచ్చారు. ఆదివారం ఓ ప్రైవేటు హోటల్‌లో  తెలంగాణ అమరుల ఆశయాల సాధన కమిటీ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ నాయకుడిగా అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. నీళ్లు, నిధులు, నియామకాలను పక్కన పెట్టారన్నారు. 

అధికారానికి వచ్చిన నాటి నుంచి అక్రమ సంపాదనే  ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో  లీడర్లు జక్కోజు వెంకటేశ్వర్ , వెంకటమల్లయ్య, అంబటి జోజిరెడ్డి, నరేశ్‌, సుదర్శన్, డి.శంకర్, శ్రీనివాస్, అనిల్, కుమారస్వామి, మల్లేశం, ప్రవీణ్ రావు, లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.