కాటారం, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య కోరారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి కాటారం, మహదేవపూర్ మండలాల్లో కాంగ్రెస్ లీడర్లు ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధికూలీలు,సెంటర్లోని షాపుల వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మహదేవపూర్ కాంగ్రెస్మండలాధ్యక్షుడు అక్భర్ఖాన్, జడ్పీటీసీ గుడాల అరుణ, నాయకులు పాల్గొన్నారు.