Katha Venuka Katha OTT: OTTలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Katha Venuka Katha OTT: OTTలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్ జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ కథ వెనుక కథ. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ సినిమాను దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ పై దండమూడి అవనీంద్ర కుమార్ నిర్మించారు. ఆలీ, సునీల్, శుభశ్రీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం వంటి నటులు కీ రోల్ చేసిన ఈ సినిమా ఇటీవలే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. 

క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన అతి తక్కువ టైంలోనే మంచి వ్యూస్ రాబడుతు దూసుకుపోతోంది ఈ సిరీస్. ఇక ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ రావడంపై మీడియా మీట్ నిర్వహించిన చిత్ర దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సినిమాకు ఓటీటీలో మంచి వ్యూస్ వస్తున్నాయని, రానున్న రోజుల్లో ఇంకా వ్యూయర్ షిప్ పెరిగే అవకాశం ఉందని, ఇంతటి ఆదరణ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కథ వెనుక కథ సినిమా విషయానికి వస్తే.. ఇదొక క్రైం థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమా. డైరెక్టర్ అయి.. తన మరదలిని పెళ్లి చేసుకోవాలనుకునే ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి దర్శకుడిగా సినిమా ఛాన్స్ వచ్చి.. సినిమా తీశాక.. ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్స్ తోపాటు కొంతమంది మిస్ అవుతారు. అదే సమయంలో నగరంలో వరుస హత్యలు జరుగుతాయి. మరి ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? మిస్ అయినా సినిమా నటులు ఎక్కడ ఉన్నారు? హీరోకి ఆ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? అనేడి మిగిలిన కథ. వీలుంటే మీకు కూడా చూసేయండి.