కార్తీక మాసం చివరి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్ లో వేచి ఉన్నారు భక్తులు.   కార్తీకదీపాలు వెలిగించుకునేందుకు భక్తులకు  ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా ,అభిషేకాలు,స్పర్శ దర్శనాలు రద్దు చేశారు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్.

మరో వైపు  వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే  వేలాది మంది భక్తులతో వేములవాడ రాజన్న సన్నిధానం కిటకిటలాడింది. కార్తీక మాసం ప్రారంభం నుండి ఇప్పటి వరకు 12 లక్షల మంది పైగా స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వెల్లడించారు. ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు భక్తులు.  చలిని సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చార భక్తులు.  భక్తుల రద్దీ దృష్ట్యా గర్భ గుడి దర్శనాలు నిలిపివేసి.. లఘు దర్శనం అమలు చేశారు .  స్వామి వారికి కోడె మొక్కుల పూజలు చెల్లించకుంటున్నారు భక్తులు.