వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కామారెడ్డి ఎమ్మెల్యే
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. తమ సమస్యను చెప్పుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా ఊళ్లు, టౌన్లలో కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఆదివారం కామారెడ్డి టౌన్‌తో పాటు, ఇసాయిపేట, చుక్కాపూర్, జనగామ, దోమకొండ, పెద్దమల్లారెడ్డి, తలమడ్ల, చిన్నమల్లారెడ్డిలో ఈ బాక్స్‌లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
మిగతా చోట్ల కూడా బాక్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా కాగితంపై రాసి బాక్సులో వేస్తే, వారంలోగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
ఇకపై ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు పనులు మానుకొని, డబ్బులు ఖర్చు చేసి ప్రయాణాలు చేసే అవసరం లేదన్నారు. సమస్య ఏమిటన్నది వివరంగా పేర్కొని, పేరు, ఊరు, ఫోన్నెంబర్రాసి బాక్సులో వేయాలన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ఆఫీసు నుంచి ఫోన్‌చేసి మొత్తం వివరాలు తెలుసుకుంటామన్నారు. సమస్యను ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి, వారు తీసుకున్న చర్యలను కంప్లైంట్చేసిన వ్యక్తికి తెలియజేస్తామన్నారు.