అవినీతి రహిత కామారెడ్డియే బీజేపీ లక్ష్యం: వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు: అవినీతి రహిత కామారెడ్డియే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన పలువురు బుధవారం రమణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాకోరుల నుంచి కామారెడ్డిని కాపాడుకోవాలంటే  బీజేపీకి ఓటువేసి గెలిపించాలన్నారు. స్థానిక బీఆర్ఎస్ లీడర్లు తమ ఆత్మగౌరవాన్ని ప్రగతి భవన్​కు తాకట్టు పెట్టారని విమర్శించారు. కామారెడ్డికి ఎమ్మెల్యేగా ఉన్న షబ్బీర్​అలీ, గంప గోవర్ధన్​ నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు.