పేద విద్యార్థికి అండగా సాఫ్ట్​వేర్​ ఉద్యోగి

పేద విద్యార్థికి అండగా సాఫ్ట్​వేర్​ ఉద్యోగి
  • రూ. 1.20 లక్షల చెక్కు అందజేత

పిట్లం, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఎంబీబీఎస్​ చదువలేకపోతున్న విద్యార్థికి పిట్లంకు చెందిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి కట్ట హరీశ్​​రెడ్డి అండగా నిలిచారు. ఆదివారం ఎంబీబీఎస్​ విద్యార్థి ఫాల్కే ఖేతన్​కు రూ. 1.20 లక్షల చెక్కు అందజేశారు. ఖేతన్​ గత ఏడాది నీట్​లో ఎంబీబీఎస్​ సీటు సాధించి ఫస్ట్​ ఇయర్​ పాస్​ అయ్యాడు. 

మరో మూడు సంవత్సరాలు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం హరీశ్​ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన స్పందించారు. రెండవ సంవత్సరం ఫీజు కోసం ఆర్థిక సహయం అందజేశారు. నాలుగేళ్ల పాటు ఆర్థికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్​​ రెడ్డిని పలువురు 
అభినందించారు.