![కట్టమైసమ్మ.. చల్లంగా చూడమ్మా](https://static.v6velugu.com/uploads/2025/02/katta-maisamma-jathara-celebrations-at-jeedimetla_vpliC346LK.jpg)
జీడిమెట్ల, వెలుగు: సూరారం కట్టమైసమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. టెంట్లు ఏర్పాటు చేసుకుని విందులు ఆరగించారు.
పోతరాజుల ఆటలు, శివసత్తుల నృత్యాలతో జాతర ఉత్సాహంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సూరారం సీఐ భరత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను నియంత్రించారు. జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగం, భవిష్యవాణి జరగనుంది. బుధవారం అన్న సమారాధనతో ఉత్సవాలు ముగియనున్నాయి.