‘కలర్స్ తమిళ’ చానెల్ లో ప్రసారమవుతున్న రియాలిటీ షో ‘కోటీశ్వరి’. సీనియర్ హీరోయిన్ రాధిక హోస్ట్ గా చేస్తున్న ఈ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ)’కి తమిళ వెర్షన్ . అయితే ఇది పూర్తిగా మహిళలు మాత్రమే పాల్గొనే షో. దేశంలో పూర్తిగా మహిళల కోసమే నడుస్తున్న ‘కేబీసీ’ రియాలిటీ షో ఇదే. గత నెల నుంచి ప్రసారమవుతున్న ఈ షోలో ఒక యువతి కోటి రూపాయలు గెలుచుకుంది. తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన కౌసల్యా కార్తిక కోటి గెలుచుకుని, ఈ సీజన్ లో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచింది. జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కౌసల్య దివ్యాంగురాలు కావడం ప్రత్యేకం. ఆమెకు వినికిడి లోపంతోపాటు, మాటలు కూడా సరిగ్గా రావు. ఆప్షన్స్ తో కూడిన స్పెషల్ బోర్డ్ ఒకటి పట్టుకుని జవాబు చె ప్పింది. వైకల్యాన్ని అధిగమించి ప్రతిభ చాటింది. గత మంగళవారం ఎపిసోడ్ లో హోస్ట్ రాధిక అడిగిన ప్రశ్నకు సరైన జవాబు చెప్పి కోటి గెలిచింది.
‘‘ఈ విజయంపై నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ షోలో నేను కోటి రూపాయలు గెలుస్తానని అనుకోలేదు. మొదట్లో కొంచెం ఇబ్బందిపడ్డాను . కానీ, రాధిక మేడమ్ సపోర్ట్ తో కాన్ఫిడెంట్ గా పార్టిసిపేట్ చేశాను” అందామె.
SEE ALSO:చిన్నతనంలో నాపై రేప్ జరిగింది