వీణవంక, వెలుగు: కరీంనగర్జిల్లా వీణవంకలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్పాడి కౌశిక్‌రెడ్డి కటౌట్ కూలి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మూడు రోజుల కింద కరీంనగర్ జల్లా వీణవంక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆశీర్వాద సభ కోసం భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలు, ఈదురుగాలులకు ఆ కటౌట్కూలి రోడ్డుపై నడిచి వెళ్తున్న సమ్మక్క(55)పై పడింది.
దీంతో ఆమె తీవ్రంగా గాయపడగా స్థానికులు ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. మూడు రోజుల రోజుల కింద ఏర్పాటుచేసిన కటౌట్ తొలగించకపోవడం ఏమిటని స్థానికులు, బాధితురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, ఈదురు గాలులు వస్తున్నందున వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.