- స్పీకర్‌కు మహిళా కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: మహిళలను చులకన చేసి మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని మహిళా కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో స్పీకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కౌశిక్ రెడ్డి మాటలు రాష్ట్రంలోని మహిళల మనోభావాలు దెబ్బతిసేలా ఉన్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి డిస్ క్వాలిఫై చేయాలన్నారు.
అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ శోభారాణి మాట్లాడుతూ.. తెలంగాణకు బతకవచ్చిన వారంటూ ఆంధ్ర సెటిలర్ల గురించి కౌశిక్ మాట్లాడిన మాటల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు.
దీనిపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఎందుకు స్పందించడం లేదన్నారు. స్పీకర్‌ను కలిసిన వారిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, మహిళా కాంగ్రెస్ నేతలు భవానీ రెడ్డి, సంధ్య రెడ్డి తదితరులు ఉన్నారు.