బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులోభాగంగా కౌశిక్ రెడ్డి ని కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి న్యాయమూర్తి ఎదుట హాజరపరిచేందుకు తన నివాసానికి తరలించారు. ఈ క్రమంలో రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరపరిచేందుకు పోలీసులు కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ముందుకు తరలిస్తుండగా పోలీస్ వాహనం నుంచే తన వాయిస్ వినిపించిన కౌశిక్ రెడ్డి వినిపించారు. ఇందులోభాగంగా కేసులకు భయపడేది లేదని వెల్లడించాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపాడు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ఎందుకు అమ్ముడుపోయారని అడిగితే అరెస్టు చేసి కేసులు పెట్టారని పండగ పూట అరెస్టు చేసి నన్ను ఇంట్లో లేకుండా చేశారంటూ వాపోయాడు.
అయితే సోమవారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కరీంనగర్ కి తీసుకొచ్చారు. అనంతరం కౌశిక్ రెడ్డి నామినేటెడ్ పర్సన్ అయిన రవీందర్ సింగ్ కు సమాచారం ఇచ్చి రాత్రి నుంచి త్రీ టౌన్ లోనే ఉంచారు.