సూర్యాపేటలో ...కనుల పండువగా కావడి మహోత్సవం

సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పాలకావడి మహోత్సవం కనుల పండువగా జరిగింది.  ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా సుబ్రమణ్య సమేత శ్రీవల్లి విగ్రహాలతో పాటు పాలకావడిలకు  భక్తులు పట్ణణంలో శోభాయాత్ర నిర్వహించారు.

  సోమవారం సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకం, సుబ్రహ్మణ్య శ్రీవల్లి దేవసేన కల్యాణ మహోత్సవం ఉంటుందని దేవాలయ ప్రధాన అర్చకులు రెంటాల సతీష్ శర్మ తెలిపారు. 19న నారాయణ బలి పూజ, సుబ్రహ్మణ్య యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అనంతుల సూర్యనారాయణ,  అనంతుల దుర్గాప్రసాద్,  అనంతుల శ్రీనివాస్,  సుబ్రహ్మణ్య సేవా సమితి వాస కృష్ణ బృందం తదితరులు పాల్గొన్నారు.