మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) ను ఇకపై గోల్డెన్ బ్యూటీ అని పిలవాల్సి వస్తుందేమో. ఆఫర్ల విషయంలో తమన్నా జోరు చూసిన వారు ఇప్పుడిదే అంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌తో ఈ బ్యూటీ ‘జైలర్’ సినిమాలో నటిస్తోంది.
ఇందులో రావాలయ్యా అంటూ సాగే ఓ పాట ఇటీవల విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో తమన్నా తళుకులకు కుర్రకారు ఊగిపోయింది. ఈ ఒక్క సాంగ్‌తో ఈ ముద్దుగుమ్మ మరిన్ని ఆఫర్లు అందుకుంటోంది.
తాజాగా అజిత్‌తో ‘విడాముయిర్చి’ అనే సినిమాలో ఈ యంగ్ హీరోయిన్‌కి చాన్స్ దక్కినట్టుగా తెలుస్తోంది. ఈ రోల్ కోసం ముందుగా త్రిష పేరు వినిపించింది. సినిమా షూటింగ్ వాయిదా పడుతుండటంతో త్రిష ఇతర ప్రాజెక్ట్స్‌లో బిజీగా మారిపోయింది. దీంతో ఈ సినిమాలో తమన్నాని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ‘వీరం’లో తమన్నా అజిత్‌తో కలిసి నటించగా ఇది బ్లాక్‌బస్టర్ హిట్టందుకుంది.